ఆదివారం రాత్రి బెంగళూరులో జరిగిన ఓ పార్టీలో డ్రగ్స్ సేవించాడని ఆరోపిస్తూ బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ అన్నయ్య సిద్ధాంత్ కపూర్‌ను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేవ్ పార్టీ జరుగుతున్నదనే సమాచారంతో బెంగళూరులోని ఎంజీ రోడ్‌లోని ఓ హోటల్‌పై పోలీసులు రైడ్ చేశారు. డ్రగ్స్ సేవించారనే అనుమానంతో 35 మంది వ్యక్తుల శాంపుల్స్‌ను పరీక్షకు పంపారు. వాటిలో ఆరు శాంపుల్స్ పాజిటివ్ అని తేలగా, ఆ ఆరింటిలో సిద్ధాంత్ కపూర్ శాంపుల్ కూడా ఉంది.
డ్రగ్స్ సేవించాక వారు పార్టీకి వచ్చారా, లేక హోటల్లో జరిగిన పార్టీలో వారు డ్రగ్స్ సేవించారా అనే విషయం తేలాల్సి ఉందని పోలీసులు చెప్పారు. బాలీవడ్ సీనియర్ యాక్టర్ శక్తి కపూర్ కొడుకు, స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ సోదరుడు అయిన సిద్ధాంత్ కపూర్ 2020లో స్ట్రీమింగ్ అయిన 'భౌకాల్' వెబ్ సిరీస్‌లో చింటూ క్యారెక్టర్ చేశాడు. అంతే కాదు, షూటౌట్ ఎట్ వడాలా, అగ్లీ, హసీనా పార్కర్, చెహ్రే లాంటి మూవీస్‌లో నటించాడు. అలాగే.. భాగమ్ భాగ్, చుప్ చుప్ కే, భూల్ భులయ్యా, ధోల్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ వర్క్ చేశాడు.
గతంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో డ్రగ్స్‌ను కలిగివున్న ఆరోపణలపై శ్రద్ధా కపూర్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ప్రశ్నించిన విషయం గుర్తుండే ఉంటుంది. అయితే, ఆమె దగ్గర ఎలాంటి డ్రగ్స్ లభించలేదు.